A Briefer History of Time ( Telugu)

A Briefer History of Time ( Telugu)

Author : Stephen W Hawking and Leonard Mlodinow (Author) Dr. KB Gopalam (Translator)

In stock
Rs. 299.00
Classification Non-Fiction/Science
Pub Date March 2023
Imprint Manjul Publishing House
Page Extent 166
Binding Paper Back
Language Telugu
ISBN 9789355432742
In stock
Rs. 299.00
(inclusive all taxes)
OR
About the Book

ప్రపంచవ్యాప్త బెస్ట్‌ సెల్లర్‌ “ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌“ స్టీఫెన్‌ హాకింగ్‌ రచన, సైంటిఫిక్‌ రచనలలో ఒక మైలురాయి. అందుకు కారణం రచయిత మాట తీరు, ఎంచుకున్న అంశాలు పట్టి చదివించే రకం అన్నది మరొకటి. విశ్వం సృష్టిలో దేవుని పాత్ర, విశ్వం చరిత్ర, భవిష్యత్తు ఎవరికయినా ఆసక్తికరాలు. అయితే పుస్తకం ప్రచురణ తరువాత పాఠకులు, పుస్తకంలోని ముఖ్యమయిన అంశాలు అర్థంకావడం కష్టంగా ఉందని ప్రొఫెసర్‌ హాకింగ్‌కు చెప్పారు. అది నిజం.
అందుకే ఎ బ్రీఫర్‌ హిస్టరీ ఆఫ్ టైమ్‌ పుస్తకం వచ్చింది. రచయిత పుస్తకంలోని అంశాలను పాఠకులకు మరింత సులభంగా అందాలి అనుకున్నాడు. అట్లాగే ఇటీవలి వైజ్ఞానిక పరిశీలనలను అందులో చేర్చాలి అనుకున్నాడు.
మాటవరుసకు మాత్రమే ఈ పుస్తకం అంతకు ముందు దానికన్నా సంక్షిప్తంగా ఉంది. కానీ వాస్తవానికి, మొదటి దానిలోని అంశాలను మరింత విస్తృతంగా మార్చింది. కేయాటిక్‌ బౌండరీ పరిస్థితుల వంటి గణితం అంశాలు ఇందులో లేవు. మరొక పక్క ఎక్కువ మందికి ఆసక్తికరంగా ఉండే సాపేక్షత, స్థలం వంపు, క్వాంటమ్‌ సిద్ధాంతం వంటి అంశాలు పుస్తకమంతటా చెదురుగా ఉండేవి. ఇక్కడ వాటిని పూర్తి అధ్యాయాల కింద విడివిడిగా వివరించారు. ప్రత్యేకంగా ఆసక్తి కలిగించే అంశాలు, స్ట్రింగ్‌ సిద్ధాంతం, ఏకీకృత సిద్ధాంతం గురించిన కొత్త పరిశోధనలు, బలాల గురించిన సిద్ధాంతంవంటి ఇటీవలి అంశాలు, విస్తారంగా వివరించే వీలు రచయితకు అందింది. మొదటి ఎడిషన్‌లాగే, ఈ పుస్తకం మరింత ఎక్కువగా సైంటిస్ట్‌లు కాని వారిని కూడా కాలం, స్థలం గురించిన చిత్రమయిన రహస్యాల అన్వేషణలో ముందుకు నడిపిస్తుంది.
ఎ బ్రీఫర్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌, సైన్స్‌ సాహిత్యానికి సరికొత్త కలయికగా అందరినీ అలరిస్తుంది.

About the Author(s)

స్టీఫెన్‌ హాకింగ్‌ కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో లుకేసియన్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మాథమాటిక్స్‌ పదవిలో పనిచేశాడు. బ్లాక్‌ హోల్స్‌ అండ్‌ బేబీ యూనివర్సెస్‌, ద యూనివర్స్‌ ఇన్ ఎ నట్ షెల్ అన్నవి వ్యాస సంకలనాలు. సాధారణ పాఠకుల కొరకు అతను రాసిన మిగత పుస్తకాలవి.

లియొనార్డ్‌ మ్లోడినోవ్‌, ఈ కొత్త పుస్తకం సహరచయిత, కాల్‌టెక్‌లో పాఠాలు చెప్పాడు. స్టార్‌ ట్రెక్‌: ద నెక్స్‌ట్‌ జెనరేషన్‌ అనే పుస్తకం రాశాడు. యూక్లిడ్‌ విండో, ఫైన్‌మన్స్‌ రెయిన్‌బో కూడా అతని రచనలే. ద కిడ్స్‌ ఆఫ్ ఐన్‌స్టైన్‌ ఎలిమెంటరీ, వరుస పిల్లల పుస్తకాలలో కూడా అతను సహరచయిత.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18431904
Code ProfilerTimeCntEmallocRealMem