Brief Answers to the Big Questions ( Telugu) )

Brief Answers to the Big Questions ( Telugu) )

Author : Stephen Hawking

In stock
Rs. 350.00
Classification Popular Science
Pub Date Feb 2021
Imprint Manjul Publishing House
Page Extent 280
Binding Paper Back
Language Telugu
ISBN 9789390085941
In stock
Rs. 350.00
(inclusive all taxes)
OR
About the Book

ప్రపంచ ప్రసిద్ధ కాస్మాలజిస్ట్‌, 'ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైం' అనే
నంబర్‌ వన్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ పుస్తక రచయిత, తన మరణానంతరం వెలువడిన ఈ
పుస్తకం ద్వారా 'విశ్వంలోని అన్నింటికన్నా పెద్ద ప్రశ్నల' గురించిన తన
తుది అభిప్రాయాలను మనకు వదిలారు.
విశ్వం ఎట్లా మొదలయింది? మానవులు భూమి మీద మనగలుగుతారా? సౌర వ్యవస్థకు
అవతల బుద్ధిజీవులు ఉన్నారా? కృత్రిమజ్ఞానం మనలను ఓడిస్తుందా?
తన పరిశోధన కాలం మొత్తంలోనూ స్టీఫెన్‌ హాకింగ్‌, విశ్వం గురించిన మన
అవగాహనలను విస్తరింపజేశాడు. కొన్ని మహత్తర రహస్యాలు గుట్టువిప్పాడు.
బ్లాక్‌ హోల్స్‌, ఊహాకాలం, పెక్కు చరిత్రలు లాంటి అంశాల గురించి తన
ఆలోచనలను విశ్వంలోని సుదూర ప్రాంతాలకు పరుగెత్తించాడు. అయినా భూమి మీద
సమస్యలకు సమాధానాలు అందించడంలో విజ్ఞానశాస్త్రం కీలకపాత్ర పోషిస్తుంది
అన్నాడు.
వాతావరణం మార్పులు, అణుయుద్ధ భయం, ఆర్టిఫీషియల్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌
అభివృద్ధి వంటి ప్రమాదకరాలయిన మార్పులవేపు ఇక ప్రస్తుతం, తన దృష్టి
సారించాడు.
పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు అన్నది చరిత్రలోనే సాటిలేని మెదడు
నుంచి వచ్చిన చివరి పుస్తకం. విస్తృత విషయాలను గురించి, ప్రేరణాత్మకంగా,
అతని సహజమయిన హాస్యం జొప్పిస్తూ, మానవజాతిగా మనం ఎదురుకుంటున్న సమస్యల
గురించి, ఒక గ్రహంగా మునుముందు మనం ఎటు పోతున్నాము అన్న విషయం గురించి
హాకింగ్‌ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పిన పుస్తకం యిది.

About the Author(s)

స్టీఫెన్‌ హాకింగ్‌ సాటిలేని సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ప్రపంచంలోనే
అత్యుత్తమ మస్తిష్కంగా లెక్కింపబడ్డాడు. కేంబ్రిడ్స్‌ విశ్వవిద్యాలయంలో
అతను ముప్ఫయి సంవత్సరాలపాటు లుకేసియన్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మాతమాటిక్స్‌
పదవిలో ఉన్నాడు. ఇంటర్‌నేషనల్‌ బెస్ట్‌ సెల్లర్‌ పుస్తకం 'ఎ బ్రీఫ్‌
హిస్టరీ ఆఫ్‌ టైం' రాశాడు.
సాధారణ పాఠకుల కొరకు అతను రాసిన పుస్తకాలు ఎ బ్రీఫర్‌ హిస్టరీ ఆఫ్‌ టైం,
బ్లాక్‌ హోల్స్‌ అండ్‌ బేబీ యూనివర్సెస్‌ (వ్యాస సంకలనం), ద యూనివర్స్‌
ఇన్‌ ఎ నట్‌షెల్‌, ద గ్రాండ్‌ డిజైన్‌, బ్లాక్‌ హోల్స్‌ : ద బిబిసి రైత్‌
లెక్చర్స్‌.
కూతురు లూసీతో కలిసి అతను పిల్లల కోసం పుస్తకాలు రాశాడు. అందులో మొదటిది
జార్జెస్‌ సీక్రెట్‌ కీ టు ద యూనివర్స్‌.
అతను 14 మార్చ్‌ 2018న మరణించాడు.
ఈ పుస్తకం తొలిమాట ఎడ్డీ రెడ్‌మెన్‌, పరిచయం ప్రొఫెసర్‌ కిప్‌ ఎస్‌.
తోర్న్‌, మలిమాట లూసీ హాకింగ్‌ రాశారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18466032
Code ProfilerTimeCntEmallocRealMem