The Archer ( Telugu)

The Archer ( Telugu)

Author : Paulo Coelho (Author), Akella Sivaprasad (Translator)

In stock
Rs. 250.00
Classification Fiction
Pub Date May 2021
Imprint Manjul Publishing House
Page Extent 158
Binding Hardcover
Language Telugu
ISBN 9788195041596
In stock
Rs. 250.00
(inclusive all taxes)
OR
About the Book

#1 పుస్తకంగా అమ్ముడుపోయిన ఆల్కెమిస్ట్ రచయిత కలం నుండి వచ్చిన అద్భుత కథ. పెద్దల నుండి జ్ఞానం కోరుకున్న ఒక యువకుడు, అతని దారిపొడుగునా నేర్చుకున్న ఆచరణాత్మక పాఠాలు !! విలుకాడులో మనం టెట్సుయా అనే వ్యక్తిని కలుస్తాము. అతను ఒకప్పుడు అసాధారణమైన విలుకాడు. తన విల్లు, బాణంతో అద్భుతాలు చేసాడు. అయితే ప్రస్తుతం అతను ప్రజాజీవితం నుండి విరమణ తీసుకున్నాడు. అతనిని అన్వేషిస్తూ ఒక యువకుడు వచ్చాడు. విల్లు మరియు బాణం గురించి ఆ యువకుడి బుర్రలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో టెట్సుయా విల్లు యొక్క మార్గంలో అర్ధవంతమైన జీవితం యొక్క సిద్ధాంతాలను వివరిస్తాడు. పాలో కొయిలో కథ, చర్య మరియు ఆత్మ ఉల్లేఖనాల మధ్య సంబంధం లేకుండా జీవించడం, తిరస్కరణ లేదా వైఫల్యం భయంతో సంకోచించబడిన జీవితం, జీవించదగిన జీవితం కాదని సూచిస్తుంది. బదులుగా ప్రతిఒక్కరూ తెగించాలి, ధైర్యం పెంచుకోవాలి. అంతేకాకుండా విధి అందించే ఊహించని ప్రయాణాన్ని స్వీకరించాలి. జ్ఞానం, ఔదార్యం, సరళత, దయ పాలో కొయిలోని, ఒక అంతర్జాతీయ, అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల రచయితగా మార్చాయి. శ్రమ, అభిరుచి, ఉద్దేశ్యం, ఆలోచన, వైఫల్యాన్ని అంగీకరించడం, వైవిధ్యాన్ని చూపాలనే తపన ఇవన్నీ సంతృప్తికరమైన జీవితానికి దోహదపడతాయన్న అంశాన్ని పాలో కొయిలో ఆసక్తికరంగా అందించారు.

About the Author(s)

పాలో కొయిలో జీవితం అతని పుస్తకాల ప్రేరణకు ప్రాథమిక వనరు. అతను మృత్యువుతో సరసాలాడాడు. పిచ్చితనం నుంచి తప్పించుకున్నాడు. మాదక ద్రవ్యాలతో చెలగాటమాడాడు. హింసను తట్టుకున్నాడు, మేజిక్‌, రసవాదంతో ప్రయోగాలు చేశాడు. తత్వశాస్త్రం, మతం గురించి అధ్యయనం చేశాడు. విస్తృతంగా చదివాడు. విశ్వాసాన్ని కోల్పోయాడు.మరలా తిరిగి పొందాడు. ప్రేమలో బాధను, ఆనందాలను అనుభవించాడు. ఈ ప్రపంచంలో తన స్వస్థలాన్ని వెదికే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సవాళ్లకు సమాధానాలు కనిపెట్టాడు. స్వంత గమ్యస్థానాన్ని కనుగొనడానికి అవసరమైనంత శక్తి అంతర్గతంగా మనలోనే ఉంటుందని విశ్వసించాడు. పాలో కొయిలో పుస్తకాలు 82 భాషలలోకి అనువదింపబడినాయి. మరియు 320 మిలియన్లకుపైగా కాపీలు 170కిపైగా దేశాలలో అమ్ముడు పోయాయి. 1998లో ఆయన నవల ఆల్కెమిస్ట్ కాపీలు 85 మిలియన్లకుపైగా అమ్ముడు పోయాయి. ఫారెల్‌ మిలియమ్స్‌, మలాలా యూసఫ్‌ జాయ్‌ వంటి విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులకి స్ఫూర్తిని కల్గించాయి పాలో కొయిలో రచనలు. ఆయన “బ్రెజిలియన్‌ అకాడెమీ ఆఫ్‌ లెటర్స్‌” సభ్యుడు. చెవాలియర్‌ డిఎల్‌ ఓర్డ్రే నేషనల్‌ డెలా లెజియన్‌ డి హోన్నూరు పొందారు. 2007లో “యునైటెడ్‌ నేషన్స్‌ మెసెంజర్‌ ఆఫ్‌ పీస్‌”గా గుర్తింపు పొందారు.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18464352
Code ProfilerTimeCntEmallocRealMem